మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ టైం రానే వచ్చేసింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు.. ప్రభాస్ స్టామినాకు ఏ మాత్రం సరిపోలేదు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తమ దాహాన్ని తీర్చడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ముఖ్యంగా సలార్, ఆది పురుష్ సినిమాలపై ఎనలేని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ముందుగా ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 12న బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటున్నారు. ప్రభాస్‌ను శ్రీరాముడిగా చూసేందుకు తహతహలాడుతున్నారు అభిమానులు. అందుకే కనీసం ఫస్ట్ లుక్ అయిన రిలీజ్ చేయాలని మేకర్స్‌ను కోరుతున్నారు.
అయితే ఇప్పుడు ఆదిపురుష్ టీజర్ టైం ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అది కూడా ఊహించని స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారట. దసరా కానుకగా అక్టోబర్ 3న అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్‌ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ టీజర్ లాంచింగ్ కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతున్నట్టు టాక్. ఆ తర్వాత దసరా రోజు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేయనున్నాడు ప్రభాస్. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ టీజర్‌ను విజువల్ వండర్‌గా అంతకు మించే అనేలా కట్ చేస్తున్నట్టు టాక్. అయితే ఈ సినిమా రామాయణం ఆధారం అని మాత్రమే తెలుసు.. కానీ అసలు కాన్సెప్ట్ ఏంటనేది టీజర్‌తోనే క్లారిటీ రానుంది. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా కనిపించనున్నాడు.