»Huge Planning For Akhil Next Prashant Neil In The Field
Akhil: అఖిల్ నెక్స్ట్ కోసం భారీ ప్లానింగ్.. రంగంలోకి ప్రశాంత్ నీల్?
ఏజెంట్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత అక్కినేని అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇంకా బయటికి రాలేదు. ఈసారి కొడితే మామూలుగా ఉండకూడదనే భావిస్తున్నాడు అఖిల్. దీంతో ఇప్పుడు ఏకంగా ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
Huge planning for Akhil Next.. Prashant Neil in the field?
Akhil: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు కెజియఫ్ సిరీస్, సలార్‌తో బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం సలార్ మూవీ ఓటిటిలో భారీ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సలార్ పార్ట్ 1ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హొంబలే.. నెక్స్ట్ సలార్ 2ని భారీ బడ్జెట్‌తో రూపొందించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి.. 2025లో సలార్ 2 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యూవీ క్రియేషన్స్‌తో కలిసి హోంబలే ఫిల్మ్స్ అండ్ ప్రశాంత్ నీల్ నిర్మాతగా అఖిల్‌తో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇటీవల జరిగిన ‘సలార్’ సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించాడని అంటున్నారు. ఏజెంట్ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అఖిల్.
ఈ సినిమాతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ భాగస్వామి కానుందని తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్ సమర్పణలో ఈ సినిమాను రూపొందించనున్నారట. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలిమ్స్ వారు అన్ని భాషలలో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా అఖిల్ సినిమా కోసం యూవీ క్రియేషన్స్‌తో కలిసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి ధీర టైటిల్ పెట్టినట్లు టాక్ బయటకొచ్చింది. అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేయడమే లేట్. ఏదేమైనా.. ఈ ప్రాజెక్ట్ అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోంది.