ఓ పోర్న్ స్టార్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. కానీ సన్నీలియేన్ మాత్రం పోర్న్ టు స్టార్ హీరోయిన్గా ఓ సంచలనమే అని చెప్పాలి. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది.
Sunny Leone: హాట్ కంటెంట్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీకి.. ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ బీ టౌన్ స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుపోకుండా.. సినిమాలు చేస్తు దూసుకుపోతోంది. తెలుగులోను కొన్ని సినిమాల్లో నటించింది. కరెంట్ తీగ లాంటి సినిమాతో పాటు.. చివరగా మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాలో కూడా మెరిసింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా చేసింది. అయితే ఓ వైపు సినిమాలు చేస్తునే మరోవైపు కమర్షియల్‌గా కూడా బాగానే సంపాదిస్తోంది సన్నీ. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. హాట్ హాట్‌గా అందాల విందు చేస్తునే ఉంటుంది.
మరోవైపు బిజినెస్ కూడా చేస్తోంది అమ్మడు. తాజాగా సన్నీ లియోన్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. తానే ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే సన్నీ కూడా పలు వ్యాపారాల్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంది. లేటెస్ట్గా కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. తన రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీలోని నోయిడాలో సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. ఎప్పుడు కూడా తన అందాలతో విందు బోజనం పెట్టే సన్నీ.. ఇప్పుడు తన రెస్టారెంట్లో రుచికరమైన వంటలను వడ్డిస్తానని చెబుతోంది. దీంతో సన్నీకి కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్స్. మరి పోర్న్ నుంచి హీరోయిన్గా మారిన సన్నీ లియోన్.. బిజినెస్ పరంగా ఎలా రాణిస్తుందో చూడాలి.