»Share Market Crash On First Day Of Week Investors Lost Rs 8 Lakh Crore
Share Market : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్‌కు మంగళవారం అశుభ దినంగా మారింది. బ్యాంకింగ్, మిడ్‌క్యాప్, ప్రభుత్వ కంపెనీల స్టాక్‌లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ పెద్ద పతనంతో ముగిసింది.
Share Market : భారత స్టాక్ మార్కెట్‌కు మంగళవారం అశుభ దినంగా మారింది. బ్యాంకింగ్, మిడ్‌క్యాప్, ప్రభుత్వ కంపెనీల స్టాక్‌లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ పెద్ద పతనంతో ముగిసింది. నేటి సెషన్లో స్మాల్‌క్యాప్ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్ ముగియగానే బీఎస్ఈ సెన్సెక్స్ 1053 పాయింట్లు పతనమై 70,370 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 333 పాయింట్లు పతనమై 21,238 పాయింట్ల వద్ద ముగిశాయి. మార్కెట్ క్యాప్‌లో రూ.8 లక్షల కోట్లు క్షీణించింది.
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ స్టాక్స్‌లో భారీ పతనం కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ 2.26 శాతం లేదా 1043 పాయింట్లు నష్టపోయింది. దీంతోపాటు ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, మీడియా, ఎనర్జీ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో భారీ క్షీణత కనిపించింది. హెల్త్ కేర్, ఫార్మా రంగ షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా భారీ పతనంతో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 5 షేర్లు గ్రీన్‌లో ముగియగా, 25 నష్టాల్లో ముగిశాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 10 లాభాలతో, 40 నష్టాలతో ముగిశాయి.