Budget expectations: NPS మరింత ఆకర్షణీయంగా.. బడ్జెట్లో ప్రకటన?
జాతీయ పింఛను వ్యవస్థను కేంద్రం ఈ బడ్జెట్లో మరింత ఆకర్షణీయంగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 75 ఏళ్లు పైబడిన చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు సమాచారం.
Budget expectations: జాతీయ పింఛను వ్యవస్థ (NPS)ను కేంద్ర ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగుల పీఎఫ్‌తో సమానంగా ఎన్‌పీఎస్‌లోనూ ప్రయోజనాలు కల్పించాలని పింఛను ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం యాజమాన్యాలు తమ ఉద్యోగుల ఎన్పీఎస్కు తమ వాటాగా చెల్లించే మొత్తంలో 10 శాతంపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. ఈపీఎఫ్ఓలో 12 శాతంగా ఉంది. ఈ బడ్జెట్లో స్పష్టత వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
ఎన్‌పీఎస్‌లో జమ, ఉపసంహరణలపై చాలా మార్పులు తీసుకరాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 75 ఏళ్లు పైబడిన ఎన్పీఎస్ (NPS) చందాదారులకు అద్భతమైన ప్రయోజనాలు అందించా డెలాయిట్ తమ బడ్జెట్ డిమాండ్లలో పేర్కొంది. అలాగే వీరికి ఎన్పీఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని వెల్లడించింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో (Interim Budget) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవస్థపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఎన్‌పీఎస్‌లో జమ చేసే మొత్తంలో రూ. 50 వేల వరకూ పన్ను రాయితీ ఉంది. 80c కింద లభించే రూ. 1.5 లక్షల రాయితీకి ఇది అదనం. ఈ వెసులబాటును కొత్త పన్నూ విధానానికీ వర్తింపజేయాలని చెల్లింపుదారులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ విధానంలో కూడా మరిన్ని ప్రయోజనాలను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.