దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠంచనున్నారు.
Ayodhya Ram Mandhir: దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠంచనున్నారు. మధ్యాహ్నం 12:20 నుంచి 1:00 మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరగనుంది. ఈ ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్వ ముహుర్తంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల సమయంలో ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. విగ్రహ కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగించి.. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దుతారు.
కాటుక దిద్దిన తర్వాత రామ్‌లల్లాకు చిన్న అద్దాన్ని చూపించి.. 108 దీపాలతో మహాహారతి ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించనున్నారు. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు.