»Ayodhya Ram Mandir Rama Who Died After 550 Years In Ayodhya
Ayodhya ram mandir: అయోధ్యలో 550 ఏళ్ల తరువాత కొలువైన రామయ్య
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గరపడింది. ఈ సమయంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 సంవత్సరాల తరువాత అయోధ్య రామలయం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని పొందుపరిచారు.
Ayodhya ram mandir: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఈనెల 22న జరగనుంది. రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి షర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో రాములోరి పతిష్టాపనకు ముందు కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 ఏళ్ల తరువాత అయోధ్య రామాలయం గర్భగుడిలో మళ్లీ రాములోరి విగ్రహం ప్రతిష్ఠంచడం జరిగింది.
भगवान श्री रामलला सरकार के अनुजों सहित दिव्य दर्शन – अयोध्या धाम
पौष मास, शुक्ल पक्ष, अष्टमी तिथि, विक्रमी संवत् २०८०
Divya Darshans of Bhagwan Shri Ram Lalla, along with his brothers- Ayodhya Dham
సుమారు 550 సంవత్సరాల తరువాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్టించారు. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ నామ స్మరణ నినాదాల నడుమ ఈ కార్యక్రమం నిన్న కన్నులపండుగగా జరిగింది. లక్షలాది జనసంద్రం నడుమ రాములోరిని ప్రతిష్టించడం జరిగింది. రాముడి విగ్రహాన్ని మైసురుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడికి చేర్చడం జరిగింది. కాగా, గురువారం ఉదయం ఈ విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ఓ ట్రక్కు ద్వారా తరలించి అనంతరం క్రేన్ సహాయంతో గర్భగుడిలోకి చేర్చడం జరిగింది. ఈ విధంగా రాములోరి రాగ ధ్వనుల మధ్య అయోధ్యలో రామయ్య కొలువైనాడు.