Hyderabad: పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లక్ష్మీవాణి టవర్స్‌పై గాలిపటాలు ఎగురవేస్తున్న చిన్నారులు. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల తనిష్క్ కూడా గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలకు సూచించారు.. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, పెద్ద విద్యుత్ లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దు. వాటిని విశాలమైన ప్రాంతాలు, మైదానాలలో ఎగురవేయాలి. అలాగే, విద్యుత్ లైన్లు, స్తంభాలు, సబ్ స్టేషన్ల గాలి పటాలను తీసుకునే ప్రయత్నం చేయవద్దు. వీటికి కాటన్, నైలాన్, లినెన్ దారాలు మాత్రమే వాడాలి. మెటాలిక్ దారాలను ఉపయోగించడం వల్ల.. అవి విద్యుత్ తీగలకు తగిలితే పెను ప్రమాదం పొంచి ఉంది. ఎత్తైన భవనాలు, బాల్కనీలు, గోడలపై నిలబడి గాలిపటాలు ఎగురవేయవద్దు. అలాగే, చిన్న పిల్లలను గాలిపటాలు ఎగరకుండా దూరంగా ఉంచండి. అత్యవసర పరిస్థితుల్లో 1912 లేదా సమీపంలోని విద్యుత్ సిబ్బందికి వెంటనే తెలియజేయాలి.