కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపటి నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టనున్నారు. మణిపూర్లో ప్రారంభంకానున్న ఈ యాత్రకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
CM Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపటి నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టనున్నారు. మణిపూర్లో ప్రారంభంకానున్న ఈ యాత్రకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. తొలి రోజు న్యాయ యాత్రలో పాల్గొన్న తర్వాత ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్తారు. అక్కడ సోనియా గాంధీ, ఖర్గే తదితరులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తారని సమాచారం. ఈ నెల 15 నుంచి 18 వరకు రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటించనున్నారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుతో పాటు లండన్ పర్యనటలో పాల్గొంటున్నారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడుదారులు హాజరవుతుంటారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొని తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు, ఓఎస్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23న సీఎం రేవంత్ నేతృత్వంలోని టీమ్ హైదరాబాద్కు తిరిగి వస్తుంది.