Brunei prince who married a common girl .. photos viral
Brunei prince: బ్రూనై రాకుమారుడు అబ్దుల్ మతీన్ ఓ సామాన్యురాలిని పెళ్లి చేసుకున్నాడు. 32 ఏళ్ల మతీన్, 29 ఏళ్ల యాంగ్ మాలియా అనిషా రోస్నాలుతో వివాహబంధంతో ఏకం అయ్యారు. బ్రూనై(Brunei) రాజు అసన్ అల్ బోల్కియా ఎక్కువ కాలంగా అధికారంలో కొనసాగుతోన్న చక్రవర్తి. గతంలో ప్రపంచంలోనే సంపన్న వ్యక్తి ఆయన. ఆయన పదో సంతానమే మతీన్. ఈయన పెళ్లాడిన యాంగ్ మాలియా బోల్కియా ముఖ్య సలహాదారుల్లో ఒకరి మనవరాలు. ఆమెకు ఓ ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. ఇక వీరి పెళ్లి వేడుకలు రాజధాని బందర్ సెరీ బెగవాన్లో అంగరంగ వైభవంగా పది రోజుల పాటు కొనసాగనున్నాయి.
సోషల్ మీడియాలో ఎంతో పేరొందిన మతీన్ హాలీవుడ్ హీరోలా దర్శనం ఇస్తాడు. యుద్ధ విమానాలు, స్పీడ్ బోట్స్లో ప్రయాణించిన వీడియాను షేర్ చేస్తుంటారు. అలాగే తన సిక్స్ ప్యాక్ బాడీతో ఫోటోలకు పోజులిస్తుంటారు. ఆయన పోలో క్రీడాకారుడు కూడా. ఈ కొత్త జంట నిశ్చితార్థం తర్వాత షేర్ చేసిన ఫొటో చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బ్రూనై ఇస్లాం రాజ్యం. అక్కడ వీరు మోడర్న్ దుస్తులు ధరించారు. ఇక మతీన్ తన ప్రేయసిని వివాహం చేసుకుంటున్నందుకు ఆ దేశ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.