వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని ఆయన అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈక్రమంలో మాట్లాడుతూ ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు.
Kolusu Parthasarathy: వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని ఆయన అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈక్రమంలో మాట్లాడుతూ ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడే నా అసమర్ధతా? వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం.. నేతి బీరకాయలో నెయ్యి చందమేనని అన్నారు. గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని నన్ను వెళ్లమన్నారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్లేదని భావించారు. నేను వెళ్లేందుకు విభేదించడం పార్టీకి నచ్చలేదు. బలహీనవర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పా. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు.
బీసీ, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరని వ్యాఖ్యానించారు. అయితే పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చించారు. వాళ్లు టీడీపీలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అయితే ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలి రా బహిరంగ సభ జరగనుంది. ఆరోజు పార్థసారథి టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.