»Guntur Kaaram Babu Is Back And Guntur Karam Mass Market
Guntur Kaaram: బాబు ఈజ్ బ్యాక్.. ఇక ‘గుంటూరు కారం’ మాస్ జాతరే!
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రీసెంట్గా వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ఇక్కడి నుంచి గుంటూరు కారం ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి.
Guntur Kaaram: జనవరి 6న జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ జనవరి 7న ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. అదే రోజు చిరంజీవి అతిథిగా వస్తున్న హనుమాన్ ఈవెంట్ ఉంది. దీంతో గుంటూరు కారం ఈవెంట్ మరో రోజు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. సినిమా రిలీజ్‌కు మరో ఐదారు రోజలు ఉంది కాబ్టటి.. ఈవెంట్ ఎప్పుడైనా ఉండొచ్చు. ఇదిలా ఉంటే.. న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు.
ఫ్యామిలీతో కలిసి శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. దీంతో ఇక నుంచి ‘గుంటూరు కారం’ మాస్ జాతర మొదలైనట్టే. మహేష్ బాబు రాకతో ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవల్ తీసుకు వెళ్ళడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈవెంట్‌తో పాటు ఇంటర్య్యూస్ కూడా ఇవ్వనున్నాడు మహేష్ బాబు. ఇప్పటి వరకు గుంటూరు కారం నుంచి గ్లింప్స్, సాంగ్స్ విడుదల చేశారు. ఇప్పుడు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడంతో పాటు ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో.. ‘గుంటూరు కారం’ పై భారీ అంచనాలున్నాయి. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.