టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రాబోతున్నట్టుగా సమాచారం.
Hanuman: హనుమాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది. జనవరి 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో హనుమాన్ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ వేడుకకు ముందుగా ప్రభాస్ గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉందని వినిపించింది. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని సమాచారం.
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో మెగాస్టార్ వస్తున్నారని చెప్పకపోయినా.. మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ అని హింట్ ఇచ్చారు మేకర్స్. దాంతో చిరునే చీఫ్ గెస్ట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం కాబోతున్నట్టు ఓ న్యూస్ వినిపిస్తు ఉంది. హనుమాన్ పాత్రలో చిరంజీవి కనిపించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. ఇదే జరిగితే.. హనుమాన్ హైప్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
ఇప్పటికే హనుమాన్కు సాలిడ్ బజ్ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా, కంటెంట్ పరంగా అదిరిపోతుందని టీజర్, ట్రైలర్, సాంగ్స్ చెబుతున్నాయి. దానికి తోడు మెగాస్టార్ తోడైతే హనుమాన్ మామూలుగా ఉండదు. పైగా మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మరి హనుమాన్ ఎలా ఉంటుందో చూడాలి.