GDWL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని నాగర్ దొడ్డి వెంకట్రాములు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం మైనార్టీల మహా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున వినతి పత్రం సమర్పించినట్లు నాయకులు తెలిపారు.