»Telangana Government Announced Sankranti Holidays For Schools
School Holidays: ఈ సారి సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే ?
జనవరి వచ్చిందంటే చాలా మంది స్కూల్ పిల్లలు సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి సెలవులతో నెలంతా గడిచిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించింది.
School Holidays: జనవరి వచ్చిందంటే చాలా మంది స్కూల్ పిల్లలు సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి సెలవులతో నెలంతా గడిచిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించింది. రేవంత్ ప్రభుత్వం 6 రోజులు సంక్రాంతి సెలవులు ఇచ్చింది. జనవరి 12 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.
జనవరి 12న ఐచ్ఛిక సెలవు, 13వ తేదీ రెండో శనివారం చాలా పాఠశాలలకు సెలవు. అలాగే 14న భోగి పండుగ, సోమవారం 15న సంక్రాంతి సాధారణ సెలవులు ఉంటాయి. అలాగే జనవరి 16న కనుమ సెలవు ఇచ్చారు.అంతేకాకుండా జనవరి 17న సెలవు ఇచ్చారు.మిషనరీ పాఠశాలలు మినహా అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులు అనే విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అలాగే జనవరి 25, 26 తేదీలు గణతంత్ర దినోత్సవం కావడంతో పిల్లలకు మరో రెండు రోజులు సెలవు ఇవ్వనున్నారు. సిలబస్ పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు పండుగ సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.