»Governor Tamilisai Rumors Of Resignation Are Untrue
Governor Tamilisai: రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవం
తమిళిపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. సొంత రాష్ట్రం తమిళినాడు నుంచి ఆమె పోటీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఈక్రమంలో గవర్నర్ స్పందించారు.
Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళిపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. సొంత రాష్ట్రం తమిళినాడు నుంచి ఆమె పోటీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఈక్రమంలో గవర్నర్ స్పందిస్తూ.. తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలిపారు. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తానని తెలిపారు. నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా ఉంటున్నా. ప్రధాని మోదీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా అని తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. దీనికోసం ఢిల్లీ వెళ్లలేదు. ఎవరినీ కోరలేదని తెలిపారు. వరద బాధితులను పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్లి వచ్చానని తెలిపారు.
తమిళసై గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇంకో మూడుసార్లు ఆమె అసెంబ్లీకి పోటీ చేసినా గెలుపు తట్టలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని గవర్నర్గా నియమిచారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.