Narendra Modi: ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో తయారైన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రధాని మోదీ అమృత్ భారత్ రైల్లోకి వెళ్లి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులు ఉన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh
Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp
కొత్త అంగులతో అందంగా తీర్చిదిద్దిన ఈ రైల్వే స్టేషన్‌కు అయోధ్య ధామ్ అని పేరు పెట్టారు. దీని రెనోవేషన్ కోసం ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసింది. రామ మందిర ఆకృతిలోనే ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దారు. ఈ స్టేషన్‌కి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్ లభించింది. అలాగే చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌ఫ్యాంట్ గదులు అందుబాటులో ఉన్నాయి. సిక్‌రూమ్‌ను కూడా నిర్మించారు. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేశారు. స్టేషన్ టాప్ ఫ్లోర్‌ని రాముని విల్లు ఆకారంలో నిర్మించారు.