»Savitri Jindal Has Pushed Back Adani And Ambani In This Years Earnings
Savitri Jindal: ఈ ఏడాది అంబానీ, అదానీలను వెనక్కి నెట్టింది ఈవిడే
ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదించిన వారి లిస్ట్‌లో అదానీ, అంబానీలను వెనక్కి నెట్టి సావిత్ర జిందాల్ ముందంజలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ జాబితాను విడుదల చేసింది.
Savitri Jindal has pushed back Adani and Ambani in this year's earnings
Savitri Jindal: భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అంబానీ(Ambani), అదానీ(Adani) పేర్లు ముందు వరుసలో ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ, ఈ ఏడాది అత్యధిక సంపదను ఆర్జించిన జాబితాలో కొత్త పేరు వినిపించింది. సావిత్రి జిందాల్(Savitri Jindal) ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. తన మొత్తం సంపద 25.3 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ ఒక్క సంవత్సరంలో ఆమె సంపద 9.6 బిలియన్ డాలర్లు మేర పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) ప్రకారం ఈ జాబితాలో సావిత్రి జిందాల్ మొదటి స్థానంలో నిలిచారు.
సావిత్రి జిందాల్, జిందాల్ గ్రూప్ ఫౌండర్ ఓంప్రకాశ్ జిందాల్ సతీమణి. ఆయన మరణించిన తరువాత ఓపీ జిందాల్ గ్రూప్‌కు ఈమె ఛైరపర్సన్‌గా ఉన్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో పరుగులు పెట్టాయి. దీంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా వృద్ధి చెందింది. దేశంలో కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఉపఖండంలో మహిళా సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ 8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ 7.15 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ 6.3 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది 5.2 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. గౌతమ్ అదానీ భారీగా సంపద పోగొట్టుకోవడంతో ఈ జాబితాలో రివర్స్లోకి వెళ్లారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ, దేశంలో తొలి స్థానంలో ఉండగా.. అదానీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.