Man knocks on door for pickle in Karnataka's Davanagere area and bites woman's cheek
Karnataka: ఇరుగు పొరుగున ఉండేవాళ్లు ఉప్పు, పప్పు ఇచ్చిపుచ్చుకోవడం పరిపాటి. అదే మాదిరిగా పక్కింట్లో ఉండే ఒక అతను అన్నంలోకి ఊరగాయ కావాలని తలుపు కొట్టాడు. పచ్చడి కోసం వచ్చాడు అనుకొని ఓ మహిళ తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది. అదే అదునుగా భావించిన కామంధుడు సదరు మహిళ బుగ్గకొరికి, అత్యాచార యత్నం చేశాడు. సదరు మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో గల దావణగెరెలో జరిగింది. దావణగెరె శివారుల్లో డీహెచ్ ముంజప్ప(48) ఉంటున్నాడు. అన్నంలోకి పచ్చడి కావాలని, ఓ మహిళ ఇంటి లోపలకి వెళ్లాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని, లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలానే ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారు. బాధితురాలని పరామర్శించిన ఎస్పీ ఉమా ప్రశాంత్.. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు.