»Mulugu Residents Killed In Tamil Nadus Madurai Road Accident
Road Accident : అయ్యప్ప దర్శనానికి వెళ్తూ .. రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసుల మృతి
తమిళనాడు రాష్ట్రం మధురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు.
Road Accident : తమిళనాడు రాష్ట్రం మధురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. కేరళ మధురై ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు కన్నుమూశారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. శబరిమల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మద్రాస్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అయ్యప్ప స్వాములు వస్తున్న కారు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏర్టిగా వాహనం అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడంతో.. ముగ్గురు స్వాములు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మొత్తం ఐదుగురు భక్తులు ఉన్నట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం తెలియగానే మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారిలో సుబ్బయ్య నాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.