ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మరోసారి పడగవిప్పుతోంది. తాజాగా చైనాలో న్యుమోనియా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ లో కూాడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్లో యాక్టీవ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. క్రమంగా ఐసీయూలో చేరుతోన్న రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కొన్ని వారాల క్రితం యాక్టివ్ కేసుల సంఖ్య 500 కంటే తక్కువగానే ఉండేవి. డిసెంబర్ నెలలో ఆ కేసుల సంఖ్య పెరిగాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారంగా ప్రస్తుతం దేశంలో మొత్తం 1185 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో గత 24 గంటల్లోనే 237 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించారు. భారత్ లో అత్యధికంగా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదైనట్లు నివేదిక చెబుతోంది. అయితే రోగులకు తేలికపాటి లక్షణాలు కనిపించడం కాస్త ఉపశమనం కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.