»Smita Sabharwal Sudden Surprise Entry To Minister Seethakka Chamber
Seethakka ఛాంబర్లో స్మిత సబర్వాల్ ప్రత్యక్షం
మంత్రిగా సీతక్క సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి ఫైలుపై సంతకం చేశారు. ఆ కార్యక్రమంలో నేతలు, అధికారులు కనిపించారు. అక్కడ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కూడా ఆగుపించారు.
Smita Sabharwal Sudden Surprise Entry To Minister Seethakka Chamber
Smita Sabharwal: గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ (Smita Sabharwal) కొన్నాళ్ల నుంచి సైలంట్‌గా ఉన్నారు. రేవంత్ సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో కనిపించలేదు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి.. ఆ శాఖ నిర్వహించిన సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో ఆమె ఢిల్లీ వెళతారా అనే చర్చ కూడా జరిగింది. సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఆ వెంటనే స్మిత (Smita)స్పందించారు. అదేం లేదని క్లారిటీ ఇచ్చారు. మంత్రి సీతక్క గురువారం పదవీ బాధ్యతలు చేపట్టగా సచివాలయంలో స్మిత సబర్వాల్ కనిపించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించారు. ఫైల్‌పై తొలి సంతకం చేశారు. పలువురు రాజకీయ నేతలు, అధికారులు హాజరయ్యారు. అక్కడ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కూడా కనిపించారు. సీతక్కకు అభినందనలు తెలియజేశారు. ఇన్నాళ్లూ చాటుగా ఉన్న.. స్మిత ఇప్పుడు బయటకు వచ్చారు. అంతకుముందు మాత్రం.. రాష్ట్ర సర్వీసులోనే ఉంటా.. ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని అన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
#Telangana | D. Anasuya Seethakka took charge as Panchayat Raj & Rural Development, and Women & Child Welfare Minister at Dr. B.R. Ambedkar Telangana State Secretariat on Thursday pic.twitter.com/PmADfnj0mL
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకాల అమల్లో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. అందులో జరిగిన అవకతవకలపై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం లేకపోలేదు. అందుకే దూరంగా ఉంటున్నారు. దానిపై చర్చ జరగడంతో ఎట్టకేలకు బయటకు వచ్చారు.