»Leopard Enter Into Hospital At Nandurbar Taluka Of Shahada Maharashtra
Viral video: ఆసుపత్రిలోకి ప్రవేశించిన చిరుత
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని ఆస్పత్రిలోకి చిరుతపులి ప్రవేశించడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందారు. షాహదా పట్టణంలోని డోంగర్గావ్ రోడ్డులో ఉన్న ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రిలోకి చిరుత చేరడంతో అక్కడకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
leopard enter into hospital at Nandurbar Taluka of Shahada maharashtra
మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఆసుపత్రిలోకి చిరుతపులి(leopard) ప్రవేశించడంతో కలకలం రేగింది. నాసిక్ జిల్లా షాహదా(Shahada) పట్టణంలోని డోంగర్గావ్ రోడ్లో ఉన్న ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రిలో చిరుతపులి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. చిరుత కనిపించిన వెంటనే ఆస్పత్రిలోని రోగుల్లో భయాందోళన నెలకొంది. ఆస్పత్రిలో చిరుత పులి అక్కడక్కడ సంచరిస్తోంది. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి వర్గాలు ఆ చిరుతను ఒక రూములో బంధించి రోగులు, వారి బంధువులను బయటకు పంపించారు.
#WATCH | Maharashtra: A Leopard entered a hospital in Nandurbar Taluka of Shahada on Tuesday. The leopard was later rescued by the Forest Department. (12.12) pic.twitter.com/ArOTltCFXg
ఆ నేపథ్యంలో ఆసుపత్రి పాలకవర్గం అటవీ శాఖ అధికారులకు(forest officers) విషయం తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానికులు, రోగుల బంధువులు దానిని చూసేందుకు ఆసుపత్రి ప్రాంతంలో వేలాది మంది గుమిగూడారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన షహదా అటవీ శాఖ సిబ్బంది దానిని బంధించారు. అయితే రాత్రిపూట ఆ వన్యప్రాణి ఆసుపత్రిలోకి ప్రవేశించి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.