సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు ఈ.రామదాస్ కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన డైరెక్టర్ గానే కాకుండా పలు సినిమాల్లో ఆర్టిస్టుగా కూడా చేశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
చూలైమేడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆయన్ను చికిత్సి నిమిత్తం తరలిస్తుండగా కన్నుమూశారు. రామదాస్ మరణవార్తతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామదాస్ కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. విల్లుపురానికి చెందిన రామదాసు సినీ రంగంపై ఆసక్తితో చెన్నై చేరారు. తన కెరీర్ లో మొదటగా రచయితగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నారు. రామదాస్ మరణవార్తతో ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.