»Chandrababu Sensational Comments On Telangana Election Results
Chandrababu: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు
తుపాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందించారు. అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని అన్నారు.
Chandrababu: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన చంద్రబాబు తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. ఇలా అహంకారంతో విర్రవీగితే ఏం అవుతుందో తెలంగాణలో చూశామని చంద్రబాబు అన్నారు. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందని అన్నారు. చేయని తప్పుకు తనని 50 రోజుల పాటు ఇబ్బంది పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ప్రశ్నిస్తే తనని జైల్లో పెట్టారని చంద్రబాబు అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదని అన్నారు. పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎక్కడని చంద్రబాబు ప్రశ్నించారు. ఈసారి తుపాను ప్రభావం చాలా ఎక్కువ ఉంది. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.