Jan Shatabdi Express: దేశంలో రైలు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒడిస్సాలో జరిగిన ప్రమాదం మరవక ముందే విజయనగరం ప్రమాదం జరిగింది. అయితే తాజాగా మరో రైలులో మంటలు చెలరేగాయి. భువనేశ్వర్ నుంచి హోరా వెళ్తున్నా జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. మంటలను వెంటనే ఆర్పివేయడంతో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.
భువనేశ్వర్ నుంచి హోరా వెళ్తున్న జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ గురువారం ఉదయం 6:30 గంటల సమయంలో కటక్ చేరుకుంది. అక్కడికి చేరుకోగానే కోచ్ దిగువ భాగంలో మంటలు చేలరేగి పొగలు వెలువడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే రైలు నుంచి కిందకు దిగిపోయారు. సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలు ఆర్పిన అనంతరం జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ 7:15కి కటక్ నుంచి బయలుదేరి వెళ్లిందని అధికారులు తెలిపారు.