»The Villagers Of Chintamadaka Were Humiliated At Kcr Farm House
KCR: చింతమడక గ్రామస్తులకు ఘోర అవమానం
సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కేసీఆర్ నేరుగా తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడే గెలిచిన బీఆర్ఎస్ ఎమ్యెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చింతమడక గ్రామస్తులు ఆయన్ను కలిసిందేకు పెద్ద ఎత్తున వెళ్లగా వారికి మాత్రం నిరాశ ఎదురైంది.
KCR Orders BRS subsidiary Union Not Contest In Singareni Elections
KCR: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడగానే కేసీఆర్(KCR) తన పదవికి రాజీనామా చేసి సొంత వాహానంలో ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడే బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలను, తదుపరి కార్యాచరణకు సంబంధించి విషయాలను చర్చించినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆయన సొంత గ్రామం అయిన చింతమడక వాసులు కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. సుమారు 540 మంది, 9 బస్సుల్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్(Farm House)కు చేరుకున్నారు.
కేసీఆర్‌ను చూసి పలకరించి వెల్దామనుకున్నారో ఏమో కానీ వాళ్లను అక్కడి సెక్యురిటీ గేటు కూడా దాటనివ్వలేదు. అనుమతి లేనిదే ఎవరినీ పంపేది లేదని స్పష్టం చేశారు. దీంతో చేసిదేమి లేక నిరీక్షించి వృథా అనుకుని వెళ్లినవారు వెనుదిరిగారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ప్రజలను కలిసేందుకు సమయం దొరకలేదు సరే, ఇప్పుడు కూడా సమయం దొరకట్లేదా అని కామెంట్లు చేస్తున్నారు. ప్రేమగా వచ్చిన వారిని పట్టించుకోకపోతే ఎలా, అందులో సొంత గ్రామస్తులు అని మరికొందరు అంటున్నారు.
గతంలో చింతమడక గ్రామస్థులపై సీఎం కేసీఆర్(KCR) వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో సమస్యలు లేకుండా చేయాలని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల లబ్ధి జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు చింతమడక అభివృద్ధికి అదనంగా రూ.50 కోట్లు ఇచ్చారు. బహుషా అభిమానంతో కేసీఆర్‌ను కలిచేందుకు గ్రామస్థులు వెళ్లుండొచ్చని తెలుస్తోంది. అంతేకాదు ఈ గ్రామంలో అనేక మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు సైతం మంజూరు చేశారు.