కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కూలీలు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురలోని రాజ్ గురు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో సోమవారం రాత్రి గోదాంలో స్టోరేజీ యూనిట్ కుప్పకూలింది.
Karnataka : కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కూలీలు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురలోని రాజ్ గురు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో సోమవారం రాత్రి గోదాంలో స్టోరేజీ యూనిట్ కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో కూలీలు పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొక్కజొన్న బస్తాల కింద 10 మందికి పైగా కూలీలు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో బస్తాల కింద చిక్కుకున్న కూలీల్లో ముగ్గురిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు కార్మికులు చనిపోయారు. కాగా వీరిలో 6 మంది మృతదేహాలను బ్యాగుల కింద నుంచి అతికష్టమ్మీద బయటకు తీశారు.
మృతులను రాజేష్ ముఖియా (25), రాంబ్రిజ్ ముఖియా (29), శంభు ముఖియా (26), లుఖో జాదవ్ (45), రామ్ బాలక్ (52)గా గుర్తించారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. రాజ్‌గురు ఇండస్ట్రీస్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు స్టోరేజీ యూనిట్ కూలిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న బస్తాలతో కూడిన పలు సెట్ల స్టోరేజీ యూనిట్లు ఒకేసారి కిందపడిపోవడంతో 10 మంది కూలీలు కింద చిక్కుకున్నారు. ముగ్గురిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.