»Pm Modi Unveils Shivaji Maharaj Statue At Rajkot Fort In Sindhudurg
PM Modi : ఘనంగా నేవీ డే.. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ నేవీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 'నేవీ డే 2023' వేడుకలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. డిసెంబర్ 4 ఈ చారిత్రాత్మక దినంగా పేర్కొన్నారు.
PM Modi : సోమవారం మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో నేవీ డే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధుదుర్గ్‌లోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ నేవీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘నేవీ డే 2023’ వేడుకలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. డిసెంబర్ 4 ఈ చారిత్రాత్మక దినంగా పేర్కొన్నారు. రాజ్కోర్ట్ కోటలో శివాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రతి భారతీయుడిలోనూ ఉత్సాహాన్ని నింపిందన్నారు. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా భారత నౌకాదళం ఇప్పుడు కొత్త ర్యాంక్‌లను తెచ్చిపెడుతోందని ఆయన అన్నారు. సాయుధ దళాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
భారతదేశం పెద్ద లక్ష్యాలను నిర్దేశిస్తోందని, వాటిని సాధించేందుకు తన శక్తినంతా ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు భారత్‌కు గొప్ప సామర్థ్యం ఉందన్నారు. భారతదేశ చరిత్రలో ఇది 5-10 ఏళ్ల భవిష్యత్తు మాత్రమే కాదు రాబోయే శతాబ్దాల భవిష్యత్తును లిఖించాల్సిన కాలం అని ప్రధాని మోడీ అన్నారు. 10 ఏళ్లలోపే భారత్ ప్రపంచంలో 10వ ఆర్థిక శక్తి నుంచి 5వ స్థానానికి చేరుకుందని అన్నారు. ఇప్పుడు మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని మోడీ అన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ చర్చనీయాంశమైంది. తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ అయినా, కిసాన్ డ్రోన్ అయినా, యూపీఐ సిస్టమ్ అయినా, చంద్రయాన్-3 అయినా, మేడ్ ఇన్ ఇండియా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోందని చెప్పారు.