Rakesh Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలు మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల క్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నియోజవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్‌పై రాకేశ్ రెడ్డి గెలుపొందారు. ఈ బీజేపీ అభ్యర్థికి ఆర్మూర్ నుంచి నలభై శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిచిన ఏడాది లోపల ఇండ్ల నిర్మాణ ప్రారంభిస్తానని రాకేష్ రెడ్డి ఇంతకు ముందే తెలిపారు. ఒకవేళ ఇండ్ల నిర్మాణం ప్రారంభించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ఆర్మూర్‌లో నిజాయితీ పాలన చేస్తానని, అవినీతి చేసిన రోజూ చావడానికి కూడా సిద్ధం అని అన్నారు. ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావడం లేదు. ప్రజలకు చేతనైంత సాయం చేయడానికే రాజకీయాల్లో వస్తున్నానని ఇంతకు ముందు తెలిపిన సంగతి తెలిసిందే.