వార్ 2 మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(hrithik roshan), టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్(jr ntr) యాక్ట్ చేసిన వార్ 2 సినిమా నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బుధవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగస్ట్ 14న వార్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వార్ 2 మూవీకి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తోన్న ఆరో సినిమా ఇది.
ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హృతిక్ రోషన్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. 2024 ఫిబ్రవరి నుంచి వార్ 2(war 2) సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు తెలిసింది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తోనే ఎన్టీఆర్ ఈ బాలీవుడ్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఫిబ్రవరిలో ముంబాయిలో ప్రారంభం కానున్న షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్నుతెరకెక్కించేందుకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
వార్ 2 సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించనున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర(devara) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దేవర తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. వార్ మొదటి భాగంలో హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో జతకట్టడంతో హైప్ ఆకాశ స్థాయికి పెరిగింది. యే జవానీ హై దీవానీ, బ్రహ్మాస్త్ర చిత్రాలకు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకుడు. వార్ 2 విడుదల తేదీని యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ ఉదయం ప్రకటించింది. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా పై బాలీవుడ్ తోపాటు, టాలీవుడ్ లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి.