NLG: విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శిస్తూ.. బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.