GNTR: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమవుతున్న సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను సరైన మార్గంలో వినియోగించడమే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్ అడ్మిన్లు తమ సభ్యుల వివరాలు, వారి సమాచార మార్పిడిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన పలు సూచనలు ఇచ్చారు.