Supreme Court: సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Supreme Court: భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే సుప్రీంకోర్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని అంబేద్కర్ ఉద్యమానికి చెందిన కొందరు న్యాయవాదులు చేసిన అభ్యర్థన మేరకు సీజేఐ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆర్గ్యుయింగ్ కౌన్సిల్ అసోసియేషన్ (ఎస్సీఏసీఏ) కూడా సీజేఐకి విజ్ఞప్తి చేసింది. 26 నవంబర్ 1949న, భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించే తీర్మానాన్ని ఆమోదించింది. తదనంతరం, రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. నవంబర్ 26, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.