బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. ఎన్నికల నియమావళిని ఆయన ఉల్లంఘించారని, ఆదివారం మధ్యాహ్నంలోపు ఆయన వివరణ ఇవ్వాలని ఈసీ తన నోటీసుల్లో తెలిపింది.
తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్ (Minister KTR)కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు (Election commission Notices) ఇచ్చింది. తమ రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆఫీస్ టీమ్ లను వాడుకున్నట్లు ఆయనపై ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఎన్నిలక నిబంధనలను ఉల్లంఘించారని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని తన నోటీసుల్లో ఈసీ తెలిపింది.
కాంగ్రెస్ నేత ఎంపీ రణ్ దీప్ సూర్జేవాలా (Randeep surjewala) ఈసీకి ఫిర్యాదు చేశారు. టీవర్క్స్లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సూర్జేవాలా ఈసీ (Election commission)కి ఫిర్యాదు చేయగా ఎన్నికల సంఘం కేటీఆర్కు నోటీసులు (Notices) ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా టీవర్క్స్ భేటీలో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా టీఎస్సీఎస్సీని ప్రక్షాళన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఎలా ఉపయోగించుకుంటారని కాంగ్రెస్ నేత సూర్జేవాలా ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నంలోపు కేటీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే చర్యలు తీసుకుంటామని ఈసీ తన నోటీసులో తెలిపింది.