»A Lorry Collided With An Auto In Visakhapatnam 8 School Children Were Injured
Visakhapatnam:లో ఆటోను ఢీకొట్టిన లారీ..ఏడుగురు స్కూల్ పిల్లలకు గాయాలు
ఈరోజు ఉదయం విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు ఉన్న స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో అందులోని ఏడుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
ఆంధ్రప్రదేశ్లోని విశాఖనగరంలో విషాదం చోటుచేసుకుంది. సంఘం శరత్ థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఆకస్మాత్తుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులకు గాయాలు కాగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈరోజు ఉదయం రైల్వేస్టేషన్ నుంచి సిరిపురం వైపు స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఆ క్రమంలో ఆటో బోల్తా కొట్టింది.
ఆ క్రమంలోనే ఆటో వెళ్లి లారీకి కొంత మీటర్ల దూరంలో ఆగింది. మరోవైపు రోడ్డుపై పడిన చిన్నారులకు గాయాలు కావడంతో తీవ్రంగా రక్త స్రావం జరిగింది. వారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో లారీ డ్రైవర్, క్లినర్ వాహనం దిగి పారిపోతున్న క్రమంలో అక్కడున్న ఆటో డ్రైవర్లు అతన్ని పట్టుకున్నారు. పోలీసులకు విషయం తెలిపి వారిని అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.