»App Based Cab Services Are Closed At Hyderabad Shamshabad Airport
Hyderabad shamshabad Airport:లో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు బంద్!
యాప్-ఆధారిత క్యాబ్‌ల సేవల విషయంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం(shamshabad Airport) వద్ద ప్రయాణికులకు ఒక సూచనను జారీ చేసింది. ప్రస్తుతం అలాంటి సేవలు ఆయా ప్రొవెడర్లలో సమస్యల కారణంగా అందుబాటులో లేవని తెలిపింది. కానీ ప్రత్యామ్నాయ సేవలు ఉన్నాయని వెల్లడించింది.
App based cab services are closed at Hyderabad shamshabad Airport
హైదరాబాద్(hyderabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)(shamshabad Airport) వద్ద ప్రయాణీకులకు ఒక అడ్వైజరీని జారీ చేశారు. ప్రొవైడర్లలో ఉన్న సమస్యల కారణంగా యాప్ ఆధారిత క్యాబ్ సేవలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే అసౌకర్యం ఉన్నప్పటికీ, విమానాశ్రయం వద్ద ప్రయాణీకులకు అనేక ప్రత్యామ్నాయ రవాణా సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ప్రయాణికులకు సులభమైన రవాణా సౌకర్యాన్ని అందించడానికి ఇతర క్యాబ్ సేవలు ఉన్నాయని తెలిపింది.
అయితే యాప్ ఆధారిత క్యాబ్‌ల లభ్యతను విషయంలో మాత్రం విమానాశ్రయానికి ప్రయాణికులు రావడానికి, బయటకు పోవడానికి ప్రస్తుతం ఇబ్బంది ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రయాణికుల ప్రయాణం సులభతరం చేయడానికి RGIA ప్రత్యామ్నాయ సేవలను ఉంచినట్లు తెలిపింది. ఈ ప్రత్యామ్నాయాలలో మేరు, స్కై క్యాబ్‌లు, వన్ కార్ వంటి వివిధ రేడియో టాక్సీ ఎంపికలు ఉన్నాయని వెల్లడించింది. కారు(car) అద్దెలు కోరుకునే వారికి విమానాశ్రయం శ్రీనివాస రెంట్ ఎ క్యాబ్, ఓమ్ ఇ-లాజిస్టిక్స్, నూరి ట్రావెల్స్, ప్రీపెయిడ్ టాక్సీ & షీ క్యాబ్‌లు, పుష్పక్ – లగ్జరీ ఎయిర్పోర్ట్ లైనర్ వంటి సేవలు కూడా ఉన్నాయని తెలిపింది.