టాలీవుడ్ యంగ్ హీర్ నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి కాబోతుడున్నాడు. నిఖిల్ భార్య పల్లవి ఇటీవల బేబి బంప్ ఫోటోతో కనిపించారు. దీంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil) తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ (Nikhil) భార్య పల్లవి గర్భవతి అనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పల్లవి డాక్టర్ అనే సంగతి తెలిసిందే. ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో 2020లో వీరి పెళ్లి జరిగింది. ఇటీవల పల్లవి బేబి బంప్‌తో కనిపించారు. దీంతో ఆమె గర్భవతి అని తెగ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. వీరి మధ్య విభేదాలు తలెత్తాయని గతంలో వార్తలు వచ్చాయి. అదేం లేదని ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి ఖండించారు. ఇప్పుడు నిఖిల్- పల్లవి జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిసింది. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కపుల్స్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.
స్వయంభూ మూవీ షూటింగ్లో నిఖిల్ బిజీగా ఉన్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మూవీ కోసం కత్తిసాము, ఇతర యుద్ధ విన్యాసాల్లో నిఖిల్ శిక్షణ తీసుకున్నారని తెలిసింది. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది. అంతకుముందు కార్తీకేయ-2, స్పై సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్వయంభూ మూవీ ఆ విధంగా రిలీజ్ చేస్తున్నారు. మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
హ్యాపీడేస్ మూవీతో నిఖిల్ తెరంగ్రేటం చేశారు. తర్వాత వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజీస్, స్పై సినిమాలు మంచి పేరు తెచ్చాయి. మధ్యలో కొన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు.