Krishnaది వన్ లైఫ్ వన్ మిషన్, కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదు: మోడీ
తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాటే మరిచారని ప్రధాని మోడీ విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు.
Pm Modi: నా కుటుంబ సభ్యులారా.. మాదిగ సోదరులా.. అంటూ ప్రధాని మోడీ (Pm Modi) మాదిగల విశ్వరూప మహాసభ వేదికపై ప్రసంగించారు. దశాబ్దాలుగా మాదిగలు అణచివేతకు గురవుతున్నారని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ గత 30 ఏళ్లుగా మాదిగల కోసం పోరాడుతున్నారని గుర్తుచేశారు. మాదిగలను రాజకీయ పార్టీలు, నేతలు మోసం చేశారని గుర్తుచేశారు. కానీ తను మీ వైపు నిలుస్తానని.. అండగా నిలబడతానని మోడీ ప్రతీన చేశారు. మాదిగలకు పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసేందుకు ఇక్కడికి వచ్చానని మోడీ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి తప్పారని మోడీ విమర్శించారు. ఇచ్చిన మాటను విస్మరించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కేసీఆర్ కూర్చొన్నారని మండిపడ్డారు. దళితబంధు పథకం ప్రవేశపెట్టినప్పటికీ.. ఆ పథకం బీఆర్ఎస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. ఇరిగేషన్ రంగంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడలేకపోయిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
అన్నీ వర్గాల ప్రజలను బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ ఎలాంటి ఇబ్బందులు కలిగించిందో మీకు తెలుసు అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాదిగలను విస్మరించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సోనియా గాంధీని కలిశారని వివరించారు. రైతు రుణమాఫీ కూడా సరిగ్గా జరగలేదన్నారు.