Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్కి చేరింది. జనం వద్దకు ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్రనేతలు క్యూ కట్టారు. తమకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తి కావచ్చింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చిన సంగతి తెలిసిందే. అందుకు గల కారణాలను బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ అధికారం చేడపుతోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత బీసీని సీఎంను చేస్తుందని అంటున్నారు. తమ పార్టీలో బీసీ అయిన బండి సంజయ్ (Bandi Sanjay) సీఎం రేసులో ఉన్నారని చెప్పారు. అందుకే ఆయనను పార్టీ అధ్యక్ష పదవీ నుంచి తప్పించామని హింట్ ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేసులో లేరని.. అందుకే అధ్యక్ష బాధ్యతలను అప్పగించామని స్పష్టంచేశారు.
అంటే బీజేపీ అధికారం చేపట్టే స్థాయిలో సీట్లు వస్తే.. బండి సంజయ్ (Bandi Sanjay) ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. అదే సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కూడా సీఎం రేసులో ఉంటారు. కానీ ఆయన తొలి నుంచి పార్టీలో లేకపోవడం.. ఏబీవీపీ, బీజేవైఎం, ఇతర సంస్థల్లో పనిచేసి ఉండకపోవడం మైనస్ అయ్యే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు వచ్చింది. ఈ సారి ఓ 10 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం అధికారం చేపడుతామనే ధీమాతో ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తారని హాట్ కామెంట్స్ చేశారు మురళీధర రావు.