»39 Congress Leaders Exiled For Six Years At Madhya Pradesh
Congress leaders: 39 మంది కాంగ్రెస్ నేతలు ఆరేళ్లపాటు బహిష్కరణ
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు 39 మంది నాయకులను ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంను ఆరేళ్లపాటు రద్దు చేసింది. అయితే ఎందుకు అలా చేసింది ? ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel)పై ఈడీ(ED) ఆరోపణలు మరువకముందే మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రాబోయే మధ్యప్రదేశ్(madhya pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు 39 మంది అభ్యర్థులను ఆరేళ్లపాటు పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరించినట్లు పార్టీ కార్యకర్త తెలిపారు.
అయితే ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ కమల్ నాథ్ ఆదేశాల మేరకు ఈ 39 మంది నేతలను కాంగ్రెస్(congress) నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సింగ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ బహిష్కరణకు గురైన నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా లేదా బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వారిలో మాజీ ఎంపీ ప్రేమ్‌చంద్ గుడ్డు (అలోట్), మాజీ ఎమ్మెల్యే అంతర్ సింగ్ దర్బార్ (మోవ్), మాజీ ఎమ్మెల్యే యద్వేంద్ర సింగ్ (నాగోడ్), రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్ (ఖర్గాపూర్), నాసిర్ ఇస్లాం (భోపాల్ నార్త్) వంటి వారిపై చర్యలు తీసుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) కూడా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కాషాయ పార్టీని అధికారం నుంచి దింపి..వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది.