రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj) – రతిక విడిపోవడానికి కారణాలను రతిక చెల్లెలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.రాహుల్, రతిక పెళ్లికి మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారని అయితే వివాహం జరిగాక ఇండస్ట్రీలో ఉండొద్దు అని కండీషన్ పెట్టడంతో అక్కకు నచ్చలేదని ఆమె అన్నారు.పెళ్లి (Wedding) కుదరదని భావించి ఇద్దరు బ్రేకప్ అయ్యారని ఆమె తెలిపారు. ఆరేళ్ల తర్వాత వారి ఫోటోలు బయటికెలా వచ్చాయో తెలియదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా కొనసాగిస్తున్నారు. రాహుల్ ఎందుకు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెట్టారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ ఫోటోలు(Photos)ఎలా బయటకు వచ్చాయి అనేది కూడా తెలియదు. రాహుల్ ను కూడా మేము అడిగే ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలి అనుకోలేదు.
ఆయన పెట్టిన పోస్టు వల్ల రతిక మీద నెగెటివ్ ప్రచారం మొదలయ్యింది. రాహుల్ ఫేమ్ వాడుకోవాలని ఏనాడు రతిక (Rathika) అనుకోలేదు. అలా అనుకుంటే అవకాశాల కోసం తన చేత రికమెండ్ చేయించుకునేది. కానీ, ఏ రోజు చేసుకోలేదు. వాళ్లు మంచిగా ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు బ్రేకప్ (Breakup) అయ్యాక చేసుకోవాల్సిన అవసరం లేదు” అని వెల్లడించింది.అటు తన పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయంటూ రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేశాడు రాహుల్. ఆరు సంవత్సరాల తర్వాత తన ఫోన్ లో పర్సనల్ గా దిగిన ఫోటోలు ఎలా బయటకొచ్చాయి అని ప్రశ్నించాడు. లోపలికి వెళ్ళేముందే ప్రీప్లాన్ చేసుకొని వెళ్ళారా? అంటూ విమర్శించాడు. రాహుల్ పెట్టిన ఈ పోస్టుతో రతికపై నెగెటివ్ (Negative) ఇంపాక్ట్ పడింది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె వ్యవహార తీరుపై ట్రోల్ చేసిన నెటిజన్లకు రాహుల్ మరో అస్త్రం అందించినట్లు అయ్యింది.