జాక్‌ఫ్రూట్ మంచి ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ ఇందులో ఉండే ఆక్సలేట్‌తో పాటు కొన్ని ప్రత్యేక పదార్థాలు శరీరంలో విషపూరితమైనవి. ఇలాంటి క్రమంలో జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత తినకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి జాక్‌ఫ్రూట్ మంచి కూరగాయ. మసాలా దినుసులతో చేస్తే నోరూరుతుంది. జాక్‌ఫ్రూట్ రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధిత పోషణలో కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి. కానీ జాక్‌ఫ్రూట్‌ను కొన్ని ఆహారాలతో తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు చుద్దాం.
బొప్పాయి
జాక్‌ఫ్రూట్ తిన్న వెంటనే బొప్పాయి తినకూడదు. జాక్‌ఫ్రూట్‌లో చాలా ఆక్సలేట్ ఉంటుంది. ఆ క్రమంలో మీరు బొప్పాయిని తింటే, అది శరీరంలోకి వెళ్లి బొప్పాయిలోని కాల్షియంతో చర్య జరుపుతుంది. దీంతో మీ శరీరంలో విషం ఉత్పత్తి అవుతుంది. అది ఎముకలు, పొట్టకు చాలా నష్టం కలిగిస్తుంది.
తమలపాకు
కొందరు పనస పండు తిన్న తర్వాత తమలపాకు తింటారు. ఇది ప్రమాదకరమైన, విషపూరితమైన ఆహార కలయిక. జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత పాన్ తినకూడదు. జాక్‌ఫ్రూట్‌లో ఉండే ఆక్సలేట్ తమలపాకు పదార్థాలతో కలిపి శరీరంలో విషపూరిత ప్రతిచర్యను కలిగిస్తుంది. ఫలితంగా కడుపులో విష రసాయనం ఏర్పడుతుంది. కాబట్టి జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత పాన్ తినవద్దు.
తెనే
మీరు పనసపండును తేనెలో నానబెట్టాలనుకుంటే, వెంటనే దానిని వదలండి. ఎందుకంటే అలా తినడం వల్ల శరీర ఆరోగ్యానికి హానికరం. అది కూడా తిన్న తర్వాత తేనె తింటే రక్తంలో చక్కెర స్థాయి మరింత రెట్టింపు అవుతుంది.
బెండకాయ
జాక్‌ఫ్రూట్, బెండకాయలను వరుసగా తినవద్దు. ఎందుకంటే ఈ రెండింటినీ కలిపి తింటే చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు. చర్మంపై తెల్లమచ్చలు లేదా ఇతర సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.