»Italian Woman Pasta Making Skills Take Internet By Storm Video Hits 20 Million Views
Pasta Making: ఈ బామ్మ పాస్తా చేస్తే..ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
పాస్తా తయారీ విధానం మీరు ఎప్పుడైనా చుశారా? లేదా అయితే ఓ బామ్మ తనదైన శైలిలో తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రేజీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Italian Woman Pasta Making Skills Take Internet By Storm Video Hits 20 Million Views
పాస్తా ఇటాలియన్ ఫుడ్ అయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫుడ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫుడ్ ని ఇష్టంగా ఆస్వాదించేవారూ ఉన్నారు. పాస్తా చూడటానికైనా దాని తయారీ విధానమైనా సరే, చూడగానే ఎవరికైనా నోరూరాల్సిందే. ఈ పాస్తాను ఒక్కొక్కరు ఒక్కోలా తినడానికి ఇష్టపడతారు. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా, రిచ్ రెడ్ నుంచి క్రీమీ వైట్, ఆహ్లాదకరమైన పింక్ వరకు సాస్‌ల శ్రేణితో సజావుగా మిళితం చేయడానికి అనుమతిస్తుంది.
పాస్తా ఆకారాల శ్రేణి పలు రకాలుగా ఉంటుంది. పెన్నే, ఫార్ఫాల్, ఫ్యూసిల్లి, ఫెటుక్సిన్. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ఆకృతిని, గ్యాస్ట్రోనమిక్ అనుభవాన్ని అందిస్తాయి. మనలో చాలా మందికి కర్మాగారాల నుంచి భారీగా ఉత్పత్తి చేయబడిన పాస్తాను రుచి చూసే అలవాటు ఉంది. అయితే స్వయంగా చేతితో పాస్తా చేయడం ఎప్పుడైనా చూశారా? ఓ బామ్మ చేతితో పాస్తా తయారు చేస్తుండగా..ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేమంది ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇటాలియన్ మహిళ చాలా సింపుల్ గా తయారు చేసింది.
ఈ వీడియోలో ఒక ఇటాలియన్ మహిళ తన కుర్చీలో కూర్చుంది. పాస్తా పిండితో కూడిన పొడవాటి స్ట్రిప్‌తో టేబుల్‌పై ఆమె పాస్తా చేస్తుండటం విశేషం. తన నైపుణ్యం కలిగిన చేతులు, కత్తితో మాత్రమే ఆమె పాస్తాను తయారు చేస్తుంది. దీంతో ఆమె చేసే విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా ఆ వీడియోపై ఓ సారి కన్నేయండి. ఈ వీడియోకి ఇప్పటి వరకు 20 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం విశేషం.