»Increasing Number Of Train Accident Deaths Help Line Numbers Set Up
Trains Accident: పెరుగుతున్న రైలు ప్రమాద మృతుల సంఖ్య..హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ప్రమాద స్థలంలో కరెంట్ లేక అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ రైల్వే సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద నేపథ్యంలో ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. రాయగడ ప్యాసింజర్‌ను వెనక నుంచి పలాస రైలు ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్ ఢీకొట్టడం వల్ల విశాఖ- రాయగడ ప్యాసింజర్ మూడు బోగీలు చెల్లాచెదురుగా అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. ఘటనలో సుమారు 40 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సుమారు 14 అంబులెన్స్‌లకు పైగా తరలించి క్షతగాత్రులకు సకాలంలో వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి మంత్రి బోత్స సత్యనారాయణ చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. మరో వైపు ఈ ప్రమాదం వల్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతోందని రైల్వే అధికారులు వెల్లడించారు.
గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం విజయవాడ (Vijayawada), విశాఖ (Vizag) ఆస్పత్రులకు తరలిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను అధికారులు అందించారు. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ (Visakhapatnam)లో హెల్ప్ లైన్ నంబర్లను (Help Line numbers) ఏర్పాటు చేశారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు 0891 2746330 0891 2744619
ఎయిర్ టెల్ 81060 53051 81060 53052
బీఎస్ ఎన్ ఎల్ 8500041670 8500041671
బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం K.G.H.లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్స్: 1. కేజీహెచ్ క్యాజువాలిటీ నంబర్ : 8912558494 2. కేజీహెచ్ డాక్టర్ మొబైల్ నెంబర్: 8341483151 3. కేజీహెచ్ క్యాజువాలిటీ డాక్టర్ మొబైల్ నెం: 8688321986
బాధితుల వైద్య సాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు.