»Rs 377 68 Crores Seized In 19 Days In Telangana Assembly Elections Mcc
Telanganaలో 19 రోజుల్లో రూ.377.68 కోట్లు పట్టివేత
తెలంగాణ ఎన్నికల తరుణంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 19 రోజుల్లో పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా రూ.377.68 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నవంబర్ 30 ఎన్నికల వరకు ఇది డబుల్ అవుతుందో లేదా త్రిబుల్ అవుతుందో చూడాలి మరి.
Rs.377.68 crores seized in 19 days in Telangana assembly elections mcc
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో(Telangana assembly elections 2023) రాష్ట్రంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున తాయిలాలు తరలివెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 19 రోజుల్లో పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో భాగంగా పోలీసులు శనివారం వరకు మొత్తం రూ.377.68 కోట్ల విలువైన నగదుతోపాటు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)లో భాగంగా చేసిన సోదాల్లో ఇవి లభ్యమయ్యాయి. అయితే MCCని అమలు చేసిన కేవలం 19 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున దొరకడం విశేషం. ఈ సీజ్లలో నగదు, మద్యం, విలువైన లోహాలు, డ్రగ్స్ సహా ఇతరాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు.
ఈ విస్తృతమైన ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్లో పోలీసులు అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 28 మధ్య పలు రకాల వస్తువులను విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. నగదు రూ.1,36,09,13,281, మద్యం విలువ రూ.28,84,54,713, గంజాయితో పాటు రూ.18,18,56,330 విలువైన ఇతర డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాలు సహా విలువైన లోహాలు, వివిధ రకాల ఉచిత ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు మొదలైన వాటి విలువ రూ.1,94,56,33,218. గడచిన 24 గంటల్లో ఏకంగా జప్తు చేసిన వాటి విలువ రూ.13,86,64,452 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక నగదు, మద్యం, విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, ఉచిత వస్తువులతో సహా మొత్తం సీజ్ల విలువ రూ.3,77,68,57,542గా అంచనా వేయబడింది. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహలు జరుగుతుండగా.. అక్టోబర్ 9 నుంచి మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగనుంది.