మేషం
మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి.
వృషభం
మీ ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది.మంచి ఫలితాలున్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతనకార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.
మిథునం
మంచిపనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
కర్కాటకం
నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీరు చేసే ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తలచినకార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహం
నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు.బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. అధికారుల సహకారంతో మేలుచేకూరుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనవసర భయం ఆవహిస్తుంది.
కన్య
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈరోజు అష్టమ స్ధానంలో ఏర్పడే పాక్షిక చంద్ర గ్రహణం వ్యతిరేక ఫలాలను ఇస్తుంది. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
తుల
మీరు చేసే పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు.
వృశ్చికం
మీ మీ రంగాల్లో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు.బంధు మిత్రుల సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు.అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.
మకరం
సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.
కుంభం
మీరు చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు.
మీనం
మీ ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతవరణం ఉంటుంది.వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది.