45 Membersతో కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ రిలీజ్
తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు.. వివిధ అంశాల ఆధారంగా 45 మందికి టికెట్ల కేటాయించింది.
Congress Second List: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ (Congress) విడుదల చేసింది. 45 మందితో కూడిన లిస్ట్‌ను మీడియాకు రిలీజ్ చేసింది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు.. వివిధ అంశాల ఆధారంగా టికెట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు.
తొలి విడత 55 మందితో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో విడతలో 45 మందితో లిస్ట్ వచ్చింది. దీంతో 100 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 4 సీట్లను కమ్యునిస్టులకు ఇస్తారు. అంటే మరో 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ టికెట్లను పీసీసీ చీఫ్ ఎంపిక చేస్తారని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళిధరన్ ఇదివరకే స్పష్టంచేశారు.
ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ బరిలోకి దిగుతారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బరిలోకి దిగుతారు. పాలకుర్తి నుంచి యశస్విన్ మామిడాల పోటీ చేస్తారు. ఇక్కడ ఆమె అత్త ఝాన్సీ పోటీ చేయాల్సి ఉంది. కానీ పౌరసత్వానికి సంబంధించిన ఇష్యూ ఉండటంతో బరిలోకి దిగలేరు. ఒకవేళ పోటీ చేస్తే.. వేములవాడలో చెన్నమనేని రమేశ్ బాబు పరిస్థితి ఎదురయ్యేది. అందుకే మిన్నకుండి పోయారు. యశస్విని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎదుర్కొబోతున్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ బరిలో ఉంటారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తారు.