మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చామని తెలిపింది. ములుగు మెడికల్ కాలేజ్ లో వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామని వెల్లడించింది. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీని రూ.1800 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో రూ.137 కోట్లతో కరకట్టలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడని, ఇది కేసీఆర్ ఘనత అని కవిత తెలిపారు.