»Complaint Against 9 People Who Gave Negative Review First Case Registered In The Country
Negative Movie Review: నెగిటివ్ రివ్యూ ఇచ్చిన 9 మందిపై ఫిర్యాదు.. దేశంలోనే తొలి కేసు నమోదు
నెగిటివ్ రివ్యూ ఇచ్చిన 9 మందిపై కేసు నమోదైంది. మలయాళం డైరెక్టర్ ఉబైనీ తాను తీసిన సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన 9 మందిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రివ్యూ నెగిటివ్‌గా ఇచ్చిన 9 మందిపై కేసు నమోదు కాగా వారికి సంవత్సరం వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.
సినిమాలపై నెగిటివ్ రివ్యూలు (Negative Review) రాసేవారికి అలర్ట్. ఎందుకంటే దేశంలోనే సినిమాల గురించి రివ్యూలు ఇచ్చేవారిపై మొదటి కేసు నమోదైంది. సినిమాలు విడుదలైతే చాలు చాలా మంది ఎగబడి మరీ యూట్యూబ్ ఛానెల్స్‌కు రివ్యూలు ఇచ్చేస్తుంటారు. మరికొందరు క్రిటిక్స్ తమ వెబ్సైట్లలో ఆ సినిమాలకు సంబంధించి రివ్యూలను ఇచ్చేస్తుంటారు. ఎవరికివారు తామే గొప్ప అనుకుని వారికి నచ్చని అంశాన్ని ముందుకు తెచ్చి సినిమా బాలేదని రివ్యూలు ఇచ్చేస్తారు. ఇంకొందరైతే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడకుండానే దానిపై నెగిటివ్ రివ్యూను ఇచ్చేస్తుంటారు. అలాంటి వారు ఇకపై కాస్త ఆలోచించాల్సిందే.
మలయాళం (Malayalam)లో ఈ మధ్యనే రాహెల్ మకాన్ కోరా (Rahel makan Kora) అనే సినిమా విడుదలైంది. అయితే ఆ సినిమాపై కొందరు నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో ఆ చిత్ర దర్శకుడు ఉబైనీ పోలీసులను ఆశ్రయించాడు. రివ్యూ ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశాడు. దేశంలోనే ఇలాంటి కేసు నమోదు చేయడం మొదటి సారి కావడం విశేషం.
డైరెక్టర్ ఉబైనీ (Director Ubaini) ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన మొత్తం 9 మందిపై ఎఫ్ఐఆర్ (FiR) నమోదైంది. సెక్షన్ 385, సెక్షన్120(0) కింద ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులకు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. లేకుంటే 5000 రూపాయల వరకూ వారికి జరిమానాను విధించే అవకాశం కూడా ఉంది.